దుర్గామాత సన్నిధిలో అక్షరాభ్యాసం
16-10-2026 | 04:48pm
తాడ్వాయి,అక్టోబర్,16( విజయక్రాంతి ): కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామంలో అంబేద్కర్ సంఘం(Ambedkar Association) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దుర్గామాత(Durga Mata Temple) సన్నిధిలో చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహించారు.ఈ సందర్భంగా శుక్రవారం దుర్గామాతకు సరస్వతి దేవి అలంకరణ చేశారు. దుర్గామాత సరస్వతి(Saraswati) దేవి గా మారిన సందర్భంలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు.ఈ కార్యక్రమంలో స్వాములు గైని రాజలింగం,రమనీల, నగేష్,సందీప్, శ్రీను, వైష్ణవి, తేజస్విని తదితరులు పాల్గొన్నారు.