గురువులను ఎడ్ల బండిపై ఊరేగింపు
సిరికొండ, అక్టోబర్ 16(విజయ క్రాంతి ):సిరికొండ మండలంలోని(Sirikonda Mandal) చిమన్ పల్లి గ్రామంలో విద్యా బుద్దులు నేర్పిన ప్రథమ గురువులకు పూర్వ విద్యార్థులు(Students) 1982-85, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.గజ మాలతో సన్మానించి డప్పు వాయిద్యాలతో ఏండ్ల బండిపై గురువులని కూర్చోబెట్టి ఊరేగింపు గా తీసుకెళ్లారు.
గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ప్రారంభ సమస్యలో ఎలాంటి సౌకర్యాలు లేని సమస్యలో ఎండ్ల బండిపై వచ్చి విద్యా బుద్దులు నేర్పిన గురువులు సత్య నారాయణ,రామాంజనేయులు, అల్ ఫ్రైడ్ బాబు ఎంతో గొప్ప విషయమని పూర్వ విద్యార్థులు అన్నారు. ప్రేమ అనురాగాలతో ఉన్నత స్థాయిలో నిలవాలని గురువులు నేర్పిన చదువు క్రమ శిక్షణ మరిచిపోలేనిదని అన్నారు.వారు చూపిన బాటలో ఎంతో మంది ప్రయోజకులు అయ్యారని అన్నారు.గురువులకు పాదాభివందనం చేసి ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో క్యాతo జలంధర్, లింగా రెడ్డి, సర్పంచ్ నర్సయ్య, శ్రీధర్, ప్రసాద్, బాలయ్య తదితరులు ఉన్నారు.