పోస్టల్ ప్రమాద బీమా సద్వినియోగం చేసుకోవాలి

16-10-2026 | 04:44pm

తాడ్వాయి,అక్టోబర్,16( విజయక్రాంతి): పోస్టల్ శాఖ(Postal Department) ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అమలు చేస్తున్న ప్రమాద బీమా పథకాన్ని(Accident Insurance Scheme) సద్వినియోగం చేసుకోవాలని ఐపిపిబి కామారెడ్డి మేనేజర్ అభిమన్యు(Abhimanyu, Manager at IPPB Kamareddy) తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలో శుక్రవారం పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో పోస్టల్ బ్యాంకు పాస్ పుస్తకాలకు ఐపిపిబి పోస్టల్ లింక్ ను నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రమాద బీమాకు సంవత్సరానికి రూ.549 చెల్లిస్తే రూ.10 లక్షల బీమా వర్తిస్తుందని తెలిపారు. ఏదైనా ప్రమాదం జరిగి ఆసుపత్రికి వెళ్తే ఖర్చులకోసం రూ.1 లక్ష చెల్లించడం జరుగుతుందని వివరించారు. ప్రమాదంలో గాయపడి వికలాంగులుగా మారితే ఈ పథకం ద్వారా రూ.5 లక్షలు చెల్లించడం జరుగుతుందని ఆయన తెలిపారు.

ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఐపిపిబి పోస్టల్ లింకును(IPPB Postal Link) వినియోగించుకుంటే ప్రభుత్వ పథకాలకు(Government schemes) సంబంధించిన డబ్బులు ఈ ఖాతాలోకి జమ అవుతాయని తెలిపారు. ప్రజలు నేరుగా ఈ ఖాతా నుంచి డబ్బులు తీసుకోవచ్చని ఆయన వివరించారు.ఈ కార్యక్రమంలో నందివాడ బీపీఎం కందడి వెంకట్ రెడ్డి,ఏండ్రియాల ఏబీపీఎం తేజస్విని తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు