బహుజన రాజ్యాధికార సమరభేరి సభ వాల్ పోస్టర్ ఆవిష్కరణ

06-10-2026 | 09:39pm

ఘట్ కేసర్, అక్టోబర్ 6 (విజయక్రాంతి) : బహుజన్ సమాజ్ పార్టీ ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ( Bahujan Samaj Party ) ఆధ్వర్యంలో ఈనెల 9వ తేదీన నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు సంబంధించిన వాల్ పోస్టర్ ను మంగళవారం పోచారం డివిజన్ పరిధిలో ఆవిష్కరించడం జరిగింది.

ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోతు రవీందర్ నాయక్  హాజరై ఈసందర్భంగా  మాట్లాడుతూ ఈనెల 9వ తారీఖున బడంగ్ పేట్ లోని సిరిపురం యాదయ్య మున్సిపల్ గ్రౌండ్ లో జరగబోయే భారీ బహిరంగ సభకు బహుజనులందరూ పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా సెక్రెటరీ గ్యార గోవర్ధన్, మండల నాయకులు లక్ష్మీనారాయణ, అశోక్, కృష్ణ, ధన్పాల్, మధు, పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు