వీర వనితల స్ఫూర్తి యాత్రను జయప్రదం చేయండి

16-09-2026 | 12:21am

ఐద్వా జిల్లా అధ్యక్షురాలు తంగేళ్ల వెంకట చంద్ర పిలుపు

గరిడేపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం(Telangana Armed Peasant Struggle)లో మహిళలు చూపిన వీరత్వం, స్ఫూర్తిని భావితరాలకు చాటేందుకు చేపడుతున్న ‘వీర వనితల స్ఫూర్తి యాత్ర’ను జయప్రదం చేయాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు తంగేళ్ల వెంకట చంద్ర పిలుపునిచ్చారు. మండలంలోని కీతవారిగూడెంలోని కామ్రేడ్ సుందరి బిక్షమయ్య భవన్‌(Comrade Sundari Bikshamayya Bhavan)లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఐద్వా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 10 నుంచి 17 వరకు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో జీబు జాతా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి వంటి వీరనారీమణులు పురుషులతో సమానంగా కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. నేటి తరానికి వారి పోరాట స్ఫూర్తి అవసరమని, చరిత్రను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ యాత్రలో భాగస్వాములు కావాలని కోరారు.కార్యక్రమంలో ఐద్వా జిల్లా కమిటీ సభ్యురాలు సుందరి రమాదేవి, యానాల సుశీల, భూతం సరిత, ఎల్లావుల పిచ్చమ్మ, ఇనుకుర్తి ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు