వారాంతపు సంతకు మళ్లీ శ్రీకారం

16-09-2026 | 12:12am

వెంకటాపూర్,(విజయక్రాంతి): మండల కేంద్రంలో ఎన్నో ఏళ్లుగా నిలిచిపోయిన వారాంతపు సంతకు మళ్లీ మోక్షం లభించింది. ఈ నెల 21వ తేదీ నుంచి ప్రతి సోమవారం గ్రామ పంచాయతీ(Gram Panchayat) సమీపంలో వారాంతపు సంత నిర్వహించనున్నట్లు గ్రామ సర్పంచ్ మామిడిశెట్టి సుగుణ తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుగుణ మాట్లాడుతూ.. మండల పరిధిలోని రైతులు(Farmers), వ్యాపారులు వారాంతపు సంతకు వచ్చి తమ ఉత్పత్తులను విక్రయించుకోవచ్చు.

కూరగాయలు, పండ్లు, బట్టలు తదితర వస్తువులను తీసుకువచ్చి క్రయవిక్రయాలు నిర్వహించుకోవచ్చని, సంత వల్ల స్థానికంగా వ్యాపార కార్యకలాపాలు పెరగడంతో పాటు రైతులు, చిన్న వ్యాపారులకు అదనపు మార్కెట్ లభిస్తుందని అన్నారు. అనంతరం గ్రామస్తులతో కలిసి వారాంతపు సంతకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ప్రతి సోమవారం జరిగే సంతను విజయవంతం చేసేందుకు గ్రామస్తులు, రైతులు, వ్యాపారులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజు, జిల్లా కాంగ్రెస్ నాయకుడు ఐలయ్య, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు కోటి, నాయకులు శ్రీను, రవి, గ్రామ కమిటీ అధ్యక్షుడు జాకీర్, బీఆర్‌ఎస్ నాయకుడు వీరమల్లు, గ్రామస్తులు రాజుకుమార్, రాజు, అజయ్, మొగిలి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు