నూతన్ కల్-శ్రీరంగవరం నక్షా రోడ్డును ఏర్పాటు చేయాలని తహసీల్దార్ కు వినతి

30-10-2026 | 07:50pm

మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): ఎల్లంపేట్ మున్సిపల్(Yellampet Municipality) పట్టణ పరిధిలోని నూతన్ కల్ నుండి శ్రీరంగవరం వరకు నక్షా రోడ్డును ఏర్పాటు చేయాలని మేడ్చల్ మండల తహసీల్దార్ ను మున్సిపల్ చైర్ పర్సన్ లావుడ్యా శ్రీదేవి రమేష్ నాయక్(Municipal Chairperson Lavudya Sridevi Ramesh Naik), వైస్ చైర్ పర్సన్ మేకల రజిత దేవేందర్ రెడ్డి లు కోరినట్లు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన్ కల్ నుండి శ్రీరంగవరం వరకు నక్షా రోడ్డును ఏర్పాటు చేయడం వల్ల పరిషత్ ప్రాంతాల రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని వారు తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.రైతులు తమ వ్యవసాయ భూములకు వెళ్లడానికి,పండించిన పంటలను తరలించడానికి నక్షా రోడ్డు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వారు వివరించారు.

రైతుల సౌకర్యార్థం నక్షా రోడ్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మున్సిపల్ చైర్ పర్సన్,వైస్ చైర్ పర్సన్ లు తహసీల్దార్ కు విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు.నూతన్ కల్ నుండి శ్రీరంగవరం వరకు నక్షా రోడ్డు ఏర్పాటు చేయాలని తహసీల్దార్ కు ఇచ్చిన వినతి మేరకు సానుకూలంగా స్పందించి సమస్యను పరిశీలించి తొందరలోనే నక్షా రోడ్డు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హామీ ఇచ్చినట్లు వారు చెప్పారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ లు సద్ది సురేష్ రెడ్డి.చిన్నోళ్ల భాస్కర.మేకల దేవేందర్ రెడ్డి.ఓం ప్రకాష్.దాది నరసింహ.వరలక్ష్మి.సురేందర్.కృష్ణా భూపాల్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు