గొర్రెల మేకల పెంపకం దారుల స్థితిగతులపై సమగ్ర సర్వే

30-10-2026 | 07:47pm

మేడ్చల్ అర్బన్ అక్టోబర్ 30(విజయక్రాంతి):ఎల్లంపేట్ మున్సిపాలిటీ(Yellampet Municipality) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గొర్రెల మేకల పెంపకం దారుల (GMPS) మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎక్కలదేవి కొంరయ్య, జిల్లా ఉపాధ్యక్షులు సానం మల్లేష్ లు అన్నలింగాపూర్ గ్రామంలో గొర్రెల మేకల పెంపకం దారుల స్థితిగతులను వారు ఎదుర్కొంటున్న  సమస్యలపై సమగ్ర సర్వే నిర్వహించినట్లు చెప్పారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొర్రెల మేకల పెంపకం తో జీవనం సాగిస్తున్న కాపర్ల ఆర్థిక సామాజిక స్థితిగతులను తెలుసుకోవడానికి ప్రభుత్వం నుంచి వారికి అందవలసిన సంక్షేమ పథకాలు సబ్సిడీలు ఎంతవరకు అందుతున్నాయో క్షేత్ర స్థాయిలో పరిశీలించడానికి సర్వే చేపట్టినట్లు వారు చెప్పారు.

గొరిల్లా పెంపకం దారులు ఎదుర్కొంటున్న మేత సమస్యలు వైద్య సదుపాయాలు గొర్రెల మేకలకు భీమా పథకం 50 సంవత్సరాలు దాటిన వారికి 5000 వేల రూపాయల ఫించన్ లు,ప్రమాదంలో మృతి చెందిన గొర్రెల కాపరులకు 10 లక్షల ఎక్స్రేషియా మధ్యకాలంలో దొంగతనాలు కుక్కల దాడులు విపరీతంగా పెరుగుతున్నాయని అన్నారు.

అదేవిధంగా సబ్సిడీలో దాన సరాపరా చేయాలనే  అంశాలను సర్వే ద్వారా సేకరించి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై సంబధిత అధికారులపై ఒత్తిడి తెస్తామని వారు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జిఎంపిఎస్ గ్రామ సొసైటీ ఉపాధ్యక్షులు బత్తుల రవి.ఆనంద్ కుమార్.సానం మహేష్.రమేష్.సానం పెంటమ్మ.శంకుతల తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు