సర్వీస్ రోడ్డు ఎక్కడ?

11-11-2026 | 05:15am
  1. సర్వీస్ రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు
  2. ఇబ్బందులు పడుతున్న పాదాచారులు

కూకట్‌పల్లి, నవంబర్ 10 (విజయక్రాంతి): కూకట్‌పల్లి జేఎన్టీయూ చౌరస్తా(Kukatpally JNTU Crossroads) నుండి మియాపూర్ మెట్రో స్టేషన్ వరకు సర్వీస్ రోడ్డు నిర్మించకపోవడంతో ఫూట్ పాత్ పైన వ్యాపారాలు నిర్వహిస్తుండడంతో పాదచారులు ప్రమాదాలకు గురవుతున్నారు. జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న సర్వీస్ రోడ్డును ఏర్పాటు చేయకపోవడం పట్ల అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిత్యం రద్దీగా ఉండే జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటం, ఫుట్ పాత్ లేకపోవడం, సర్వీస్ రోడ్డును నిర్మించకపోవడంతో పాదచారులు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఇదే విషయాన్ని స్థానికులు పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన కరువైందని ఆరోపిస్తున్నారు.

హైటెక్ సిటీకి సమీపంగా ఉన్న ప్రాంతం కావడంతో నిజాంపేట్, ప్రగ తి నగర్, బాచుపల్లి, హైదర్ నగర్, అడ్డగుట్ట సొసైటీ పరిసర ప్రాంతాల్లోని సాఫ్ట్వేర్ ఉద్యోగులు కార్యాలయం తమ కార్యాలయాలకు వెళ్లడానికి నిత్యం ఉదయము, సాయంత్రం ఈ రహదారి గుండా ప్రయాణిస్తుంటారు. వాహనాల వినియోగం పెరగడం తో ఉదయం,

సాయంత్రం వేళలో హైదర్నగర్ జేఎన్టీయూ చౌరస్తా నుండి హైదర్ నగర్ వరకు నిత్యం రద్దీగా ఉంటుంది. సాయం త్రం వేళ ఫుట్ పాత్ మీద నడవడానికి పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫుట్పాత్ ను వ్యాపారస్తులు ఆక్రమించడంతోపాటు, వాహనాల పార్కింగ్ చేస్తుండడంతో పాదజారులు రోడ్డుపై నడవడానికి ప్రయత్నిస్తుండడంతో ప్రమాదాల బారిన పడుతున్నారు.

సర్వీస్ రోడ్డును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయకపోవడంతో సమీప కాలనీలోని స్థానిక ద్విచక్ర వాహనదారులు రాంగ్ రూట్ లో రావడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు రాత్రి 9 దాటిందంటే దూర ప్రాంతాలకు వెళ్లే ట్రావెల్స్ బస్సులు ఒకేసారి రోడ్లపైకి రావడం, సర్వీస్ రోడ్డు లేకపోవడంతో ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

ఇప్పటికైనా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు రోడ్డు విస్తరణ పనులు చేపట్టి సర్వీస్ రోడ్డును ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించడం కోసం స్థానిక ప్రజాప్రతినిధులు సైతం వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని స్థానిక ప్రజలు కోరుచున్నారు.

మరిన్ని వార్తలు