కాంగ్రెస్ మైనారిటీ జిల్లా కమిటీ నియామకం
ఆసిఫాబాద్, అక్టోబర్ 10 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో(DCC Office) శనివారం కాంగ్రెస్ మైనారిటీ జిల్లా కమిటీని(Congress Minority District Committee) నియమించారు. డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క(Suguna Athram), జిల్లా మైనారిటీ చైర్మన్ అర్షద్ హుస్సేన్(Arshad Hussain) ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మైనారిటీ విభాగం బలోపేతం, పార్టీ అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.
ఈ సమావేశంలో ఆసిఫాబాద్ ఫ్లోర్ లీడర్ అబ్దుల్లా బిన్ అహ్మద్, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఉబేద్ బిన్ యహియా (తారిక్), టౌన్ ప్రెసిడెంట్ మీర్ కాశీఫ్ అలీ హష్మీ, ఎస్సీ సెల్ అసెంబ్లీ అధ్యక్షుడు జాడీ ప్రసాద్, జిల్లా మైనారిటీ జనరల్ సెక్రటరీ షేక్ కలీం, యూత్ కాంగ్రెస్ నాయకుడు కృష్ణా, ఎండీ తాజ్, జాడీ తిరుపతి, సిర్పూర్ (టి) మైనారిటీ మండల అధ్యక్షుడు ముకీద్, కౌటాల మైనారిటీ మండల అధ్యక్షుడు తుఫైల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.