ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు!
10-10-2026 | 10:47pm
మణికొండ డివిజన్ 127
మణికొండ, అక్టోబర్ 10 (విజయక్రాంతి): మణికొండ డివిజన్(Manikonda Division) 127 పరిధిలోని మర్రిచెట్టు సర్కిల్ వద్ద ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలను(Bathukamma celebrations) ఘనంగా నిర్వహించారు. మహిళలు సంప్రదాయబద్ధంగా రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఆటపాటలతో సర్కిల్ పరిసరాలు పండుగ శోభను సంతరించుకున్నాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు(Telangana culture and traditions) ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. స్థానికంగా పండుగ వాతావరణం నెలకొంది.