ఎంగిలి బతుకమ్మ వేడుకలు
శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయ కమిటీ
భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 10 ( విజయక్రాంతి ) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) కేంద్రంలోని స్థానిక శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయ కమిటీ(Sri Bhaktanjaneya Swamy Temple Committee) ఆధ్వర్యంలో శనివారం ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో బతుకమ్మలతో పాల్గొని ఉత్సాహంగా బతుకమ్మ ఆట ఆడారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మెన్ నాగపురి సమ్మన్న గౌడ్, 3వ వార్డు కౌన్సిలర్ అరుణ్ రావు, ఆలయ కమిటీ డైరెక్టర్లు కోమల, ఇస్లావత్ రవి, యాంసాని శ్రీనివాస్, రమణాచారి, వెంకటస్వామి, బాలాజి, ఆలయ అర్చకులు డింగిరి మురళీకృష్ణ, రాధాకృష్ణ, ఈఒ మహేష్ తదితరులు పాల్గొన్నారు.