సంస్కృతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ప్రపంచ ఫార్మసిస్ట్ డే వారోత్సవాలు
వైద్య శిబిరం, ర్యాలీ వివిధ అవగాహన కార్యక్రమాలు
ఘట్ కేసర్, అక్టోబర్ 1 (విజయక్రాంతి) : ప్రపంచ ఫార్మసిస్ట్ డే, జాతీయ ఫార్మసీ వారోత్సవాలు–2026 సందర్భంగా ఘట్ కేసర్ డివిజన్ పరిధి కొండాపూర్ లోని సంస్కృతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ(Sanskruti College of Pharmacy) ఆధ్వర్యంలో పలు అవగాహన, విద్యా, సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా మెడికవర్ హాస్పిటల్స్ సహకారంతో కొండాపూర్‌లో వైద్య శిబిరం, అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఆరోగ్య పరిరక్షణ, ఔషధాల సక్రమ వినియోగం, ఫార్మసిస్ట్‌ల ప్రాధాన్యత, ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమాల్లో ఫార్మ్.డి మరియు బి.ఫార్మసీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలు రన్నరప్‌లకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ కె. శివకేశవ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్. నరసింహారావు, విభాగాధిపతులు డి. స్వాతి, వి. ఉమారాణి, పి. మునిజ, పి. లక్ష్మి, ఎన్‌ఎస్‌ఎస్ సమన్వయకర్త కె. అనిల్ కుమార్, రాజేంద్రప్రసాద్, అధ్యాపకులు, ఫార్మసీ విద్యార్థులు పాల్గొన్నారు.