ముంబైకి మరో విజయం

23-11-2026 | 05:10am
  1. బరోడా, ఢిల్లీ, హైదరాబాద్ గెలుపు
  2. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ

కోల్‌కతా, నవంబర్ 22: సయ్యద్ ముస్తా క్ అలీ టీ20 టోర్నీలో(Syed Mushtaq Ali T20 Tournament) ముంబై జైత్రయాత్ర కొనసాగుతోంది. భారత మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని ముంబై నాలుగో విజయాన్ని అందుకుంది. ఛత్తీస్‌ఘడ్‌పై 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

మొదట బ్యాటింగ్ చేసిన ఛత్తీస్‌ఘడ్ నిర్ణీత 20 ఓవర్లలో 159 పరుగులు చేసింది. ఆల్‌రౌండర్ శివమ్ దూబే అద్భుతంగా బౌలింగ్ చేసి 21 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు.160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై, మరో 7 బంతులు మిగిలి ఉండగానే కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

రఘువంశీ 63 బంతుల్లో 84 పరు గులతో (నాటౌట్) కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. ఈ గెలుపుతో ముం బై జట్టు సూపర్ లీగ్ దశకు అర్హత సాధించే అవకాశాలను మరింత మెరుగుపరుచుకుం ది. మరో మ్యాచ్‌లో బరోడా 4 వికెట్ల తేడాతో బెంగాల్‌పై గెలుపొందింది. అలాగే హర్యానాతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 

మరిన్ని వార్తలు