ట్విస్టులు, టర్న్స్‌తో వినోదం పంచే చిత్రమిది

17-10-2026 | 05:00am

స్టార్ డైరెక్టర్ వెంకీ కుడుముల(Venky Kudumula) నిర్మాతగా వాట్ నెక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. ఈ సినిమాతో అనీష్ హీరోగా పరిచయం అవుతుండగా, కొత్త దర్శకుడు మహేశ్ ఉప్పల తెరకెక్కిస్తున్నారు. అనస్వర రాజన్ ఇందులో కథానాయిక. ఈ సినిమా అక్టోబర్ 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ బిగ్ రివిల్ చేశారు. అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) సమర్పణలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటించారు. ఈ మేరకు మేకర్స్ ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌లో నాగార్జున మాట్లాడుతూ.. “కొత్త టాలెంట్ అంటే నాకు చాలా ఇష్టం.

కథ మీద నమ్మకంతో సినిమాను అద్భుతంగా పూర్తిచేశారు. పూర్తి సినిమా చూశా.. చాలా నచ్చింది. సినిమా అంతా ట్విస్టులు, టర్న్స్‌తో నడుస్తూ హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఉంటుంది. ఈ సినిమాకు సమర్పకుడిగా ఉండటం చాలా గర్వంగా, సంతోషంగా ఉంది” అన్నారు. హీరో అనీష్ మాట్లాడుతూ.. “నాగార్జున ఈ సినిమా చూసి చాలా అద్భుతంగా ఉందని చెప్పడం మాకు మరింత బలాన్నిచ్చింది” అని చెప్పారు. హీరోయిన్ అనస్వర మాట్లాడుతూ.. “నాగార్జున మా సినిమాను ప్రజెంట్ చేయడం చాలా ఆనందాన్ని ఇస్తోంది” అని తెలిపింది. ‘నా తొలి చిత్రం నాగార్జున సమర్పణలో రావడం నిజంగా నాకు చాలా గర్వకారణం’ అని చిత్ర దర్శకుడు మహేశ్ అన్నారు. 


మరిన్ని వార్తలు