రామ్‌చరణ్ సరసన అనీత్ పడ్డా!

25-10-2026 | 05:25am

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్(Creative Director Sukumar) కాంబినేషన్‌లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్సీ17 హీరోయిన్ ఎంపికపై టాలీవుడ్‌లో సరికొత్త చర్చ నడుస్తోంది. ఈ సినిమాలో కథానాయికగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్ నటిస్తుందనే ప్రచారం కాకుండా, బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ధురంధర్ ఫేమ్ సారా అర్జున్ పేరు వినిపించింది. తాజా ఫిలింనగర్ సమాచారం ప్రకారం ఈ రేసులోకి మరో సరికొత్త బాలీవుడ్ బ్యూటీ వచ్చి చేరింది.

ఇటీవలే సయ్యారా సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకొని, యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న టాలెంటెడ్ బ్యూటీ అనీత్ పడ్డాను రామ్ చరణ్‌కు జోడీగా సుకుమార్ పరిశీలిస్తున్నట్లు నెట్టింట జోరుగా టాక్ నడుస్తోంది. సారా అర్జున్.. చరణ్ పక్కన చిన్నపిల్లలా కనిపిస్తుందేమో అనే సందేహంతో, మేకర్స్ అనీత్ పడ్డా వైపు మొగ్గు చూపుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

మరికొందరు ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండే అవకాశం ఉందనే ఊహాగానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ పాన్-ఇండియా ప్రాజెక్టుకు సంబంధించిన లాంఛనమైన పూజా కార్యక్రమాలు అక్టోబర్ 26 లేదా 27 తేదీల్లో జరగనున్నాయి. ఈ పూజా ఈవెంట్ రోజే హీరోయిన్ ఎవరనే విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు