పేచీలపై సీరియస్!

05-11-2026 | 05:25am

మంత్రి దామోదర, ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు తీరుపై అసంతృప్తి 

సంధి కుదిర్చే పనిలో పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్

హైదరాబాద్, నవంబర్ 4 (విజయక్రాంతి) : తెలంగాణలో కాంగ్రెస్ నేతల(Congress leaders) మధ్య నెలకొంటున్న విభేదాలు ఇప్పుడు పార్టీ నాయకత్వానికి దినదినం తలనొప్పి గా మారుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో పార్టీ నాయకుల పేచీలను కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్‌గా తీసుకున్నది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు(MLAs and Ministers), ముఖ్యనేతల వ్యాఖ్య లు రాజకీయంగా చర్చనీయాంశమవు తుండగా.. తాజాగా మంత్రి దామోదర రాజనర్సింహ(Damodara Raja Narasimha), జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు(Laxmikantha Rao) మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నదనే ప్రచారంపై పార్టీలో కలకలం రేపుతోంది.

ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన టీపీసీసీ.. నష్టనివారణ చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా గురువారం గాంధీభవన్‌కు రావాల్సిందిగా మంత్రికి, ఎమ్మెల్యేకు పీసీసీ నుంచి ఆదేశాలు వెళ్లాయి. వీరి మధ్య గొడవ పార్టీ పరువును బజారున పడేలా చేసిందని పీసీసీ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు నేతలతో విడివిడిగా, అవసరమైతే కలిపి మాట్లాడి అసలు వివాదానికి మూలమేంటో ఆరా తీయనున్నట్లు సమాచారం. అయితే ఢిల్లీ వేదికగా కీచులాడుకోవడానికి ఈ ఇద్దరి మధ్య అంత పెద్ద విభేదాలేమిటీ? పీసీసీ ముందు ఏం సంజాయిషీ ఇవ్వబోతున్నారు? పార్టీ ఎలా స్పందిస్తుంది? అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.  

పార్టీ ఇమేజ్‌కు డ్యామేజ్.. 

ఎస్‌ఐఆర్, సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమి ఢిల్లీలో  నిరసన ర్యాలీకి  తెలంగాణ నుంచి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో హస్తినకు వెళ్లారు. అయితే, ఢిల్లీలోని షాంగ్రిలా హోటల్ లాబీలో మంత్రి దామోదర రాజనర్సింహ తనపై వ్యక్తిగత దూషణలకు దిగారని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించారని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ఆరోపించినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

మంత్రి తనపై గట్టిగా కేకలు వేస్తూ దుర్భాషలాడారని ఎమ్మెల్యే విచారం వ్యక్తం చేసినట్లు ప్రచారంలో ఉంది. నామినేటెడ్ పదవులు, పార్టీ వ్యవహారాలు, నియోజకవర్గ స్థాయి పనులకు సంబంధించి తలెత్తిన విభేదాలే ఈ వాగ్వాదానికి కారణమనే చర్చ జరుగుతోంది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏదో ఒక నియోజకవర్గంలో అసమ్మతిగళం వినిపిస్తూనే ఉంది. 

మరిన్ని వార్తలు