ఇప్పటికి ఆయన మాజీ భార్యగానే చూస్తున్నారు

06-11-2026 | 08:25pm

నటి, నిర్మాత రేణు దేశాయ్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. విడాకులు తీసుకుని 14 ఏళ్లు గడిచినా సమాజం తనను ఇప్పటికీ పవన్ కల్యాణ్ మాజీ భార్యగానే గుర్తిస్తోందని తాజా ఇంటర్వ్యూ (Interview)లో ఆవేదన వ్యక్తం చేశారు. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు.

2012లో విడాకుల తర్వాత తాను ఖాళీగా ఉండలేదని, మరాఠీ సినిమాను నిర్మించడంతో పాటు దర్శకత్వం, రచన, టీవీ షోలలోనూ పని చేశానని తెలిపారు. ప్రస్తుతం మళ్లీ సినిమాల్లో నటిస్తున్నట్లు చెప్పారు. శ్రీరాముడి వనవాసం 14 ఏళ్లకే ముగిసిందని గుర్తుచేస్తూ.. తన మానసిక వేదన ఎప్పుడు ముగుస్తుందని ప్రశ్నించారు. ఇతరుల జీవితాలపై వ్యాఖ్యలు చేసే ముందు ఆలోచించాలని కోరారు.

మరిన్ని వార్తలు