‘పవర్‌పేట’ నుంచి పడమటవీధి జానకి వచ్చింది!
సందీప్ కిషన్(Sundeep Kishan) హీరోగా, కృష్ణ చైతన్య రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘పవర్‌పేట(Powerpeta)’. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నేతృత్వంలోని సక్సెస్ఫుల్ నిర్మాణ సంస్థ 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇంటెన్స్ క్యారెక్టర్లు, డ్రామాతో కూడిన పవర్ఫుల్ కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే మేకర్స్ సందీప్ కిషన్‌ను సేనాపతి రవిగా పరిచయం చేస్తూ పవర్ఫుల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి కథానాయిక పాత్రను పరిచయం చేశారు.
యంగ్ బ్యూటీ రితికా నాయక్(Young beauty Ritika Nayak) ఈ చిత్రంలో సందీప్ కిషన్ సరసన హీరోయిన్గా నటిస్తోంది. రితికా నాయక్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను, గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో ఆమె పాత్రను ‘పడమటవీధి జానకి’గా పరిచయం చేశారు. సంప్రదాయబద్ధమైన, అందమైన లుక్‌లో కనిపిస్తున్న రితికా నాయక్.. పాతకాలపు ఇంట్లో చెక్క బెంచీపై హుందాగా కూర్చుని ఆకట్టుకుంటోంది.
ప్రస్తుతం సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. మధీ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్. రామకృష్ణ, మోనికా ప్రొడక్షన్ డిజైన్‌ను చూసుకుంటుండగా, సచిన్ సుధాకరన్, హరిహరన్ సౌండ్ డిజైన్.