నిత్యారెడ్డి ఆపరేషన్ ‘ఓం’
వెర్సటైల్ స్టార్ హీరో ధనుష్(Dhanush) కథానాయకుడిగా.. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఓం చాప్టర్(Om Chapter) 1: ఉధిరం ది బ్లడ్ వుడ్’ నుంచి హీరోయిన్ సాయిపల్లవి(Sai Pallavi) క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియో విడు దలైంది. ఈ సినిమాలో ఆమె నిత్యారెడ్డి అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో(Role of a police officer) కనిపించనున్నారు. నిత్యారెడ్డి.. తెలివితేటలు, నిజాయతీ, అనుభవం ఉన్న యువ పోలీస్ ఆఫీసర్‌గా పరిచయమైంది.
గతంలో సీబీఐ, ఇంటర్‌పోల్‌లో పనిచేసిన ఆమె.. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చేపట్టిన ‘ఆపరేషన్ ఓం’ను లీడ్ చేస్తుంది. సహజమైన నటన, హావభావాలతో ప్రేక్షకులను మెప్పించే సాయిపల్లవి.. నిత్యారెడ్డి పాత్రతో మరో కొత్త సవాల్‌ను స్వీకరించారు. ఆర్ టేక్ స్టూడియోస్ బ్యానర్‌పై శ్రద్ధా అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమాను ధనుష్‌కు చెందిన వండర్‌బార్ ఫిల్మ్స్‌తో కలిసి రూపొందిస్తున్నారు.
ఈ చిత్రంలో ధనుష్, మమ్ముట్టి, సాయిపల్లవి, శ్రీలీల, నసీరుద్దీన్ షా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. కే ఎళిల్ అరసు సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, ఆర్ కళైవానన్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఏ పన్నీర్‌సెల్వం ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. యానిక్ బెన్, కేచా ఖంపక్డీ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ అందించారు. ఈ సినిమా నవంబర్ 20న థియేటర్లలో విడుదల కానుంది.