ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి గెలుపే లక్ష్యంగా పనిచేయాలి..
బిజెపి ములుగు జిల్లా ఉపాధ్యక్షురాలు మేడిశెట్టి ఓమ్రా
ములుగు (విజయక్రాంతి): రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని బిజెపి జిల్లా ఉపాధ్యక్షురాలు మేడిశెట్టి ఓమ్రా అన్నారు. ఉమ్మడి వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల(MLC Elections)ను పురస్కరించుకుని మండల కేంద్రంలో మంగళవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షుడు తాళ్లపల్లి లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలని సూచించారు. అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించి, ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త తమ పరిధిలోని పట్టభద్రులను గుర్తించి, వారికి ఓటు నమోదు ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించాలని కోరారు. అధిక సంఖ్యలో అర్హులైన పట్టభద్రుల ఓట్లు నమోదయ్యేలా నిరంతరం కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు సిద్ధబోయిన సురేందర్, జిల్లా ఐటీ సెల్ కన్వీనర్ డ్యాగాలా సాలెందర్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు మాదరి శ్రీకాంత్, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి జంగా హనుమంత రెడ్డి, గిరిజన మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పూణే భాస్కర్, మాజీ మండల అధ్యక్షుడు మల్లెల రాంబాబు, ఓబిసి మండల అధ్యక్షుడు ఎరుకల శ్రీను, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు వర్ధిల్లు వెంకన్న, మండల ప్రధాన కార్యదర్శి మోరే నాగేష్, బూత్ అధ్యక్షులు ధనసరి దిలీప్, చెవుగాని రఘుబాబు, మండల నాయకులు కోర్నెబెల్లి సేనాపతి,వల్లపు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.