ఉమ్మడి వరంగల్ జిల్లా ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఎన్నికలు
వెంకటాపురం,(విజయక్రాంతి): హనుమకొండ ములుగు రోడ్డులోని కె.ఎస్.ఆర్ గార్డెన్ లో ఆదివారం జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లా(Joint Warangal District) ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఎన్నికలు(Elections) ఉత్కంఠభరితంగా సాగాయి.ఈ ఎన్నికల్లో గత 23 సంవత్సరాలుగా అధ్యక్షుడిగా కొనసాగుతున్న గాదె లింగమూర్తి బంపర్ మెజారిటీతో తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయనతో పాటు ఆయన బలపరిచిన 9 మంది అభ్యర్థులు కూడా అఖండ మెజారిటీతో విజయం సాధించారు.
ఈ విజయాన్ని పురస్కరించుకుని వాజేడు, వెంకటాపురం మండలాల ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ముఖ్య సలహాదారులు రాగం సాంబశివరావు ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు.ఈ సందర్భంగా సీనియర్ ఫోటోగ్రాఫర్ వలుస రమేష్, అధ్యక్షులు చంద్రకళ,ఉపాధ్యక్షులు దారిశెట్టి నాగేశ్వరరావు తదితర ఫోటోగ్రాఫర్లు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. అనంతరం వెంకటాపురం మెయిన్ సెంటర్ లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో చెన్నం రాజు, ఆనంద్, రంజిత్, కిషోర్, రవి, భాను తదితరులు పాల్గొన్నారు.