గొల్లాల గుడి శివాలయాల శిల్పకళపై పరిశీలన

30-10-2026 | 07:44pm

వెంకటాపూర్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): మండలంలోని పాలంపేట గ్రామంలో(Palampet Village) గల రామప్ప దేవాలయంతో(Ramappa Temple) పాటు దాని ఉపాలయాలైన గొల్లాల గుడి శివాలయాలను డెక్కన్ హెరిటేజ్ ఫోరం ఫర్ బెటర్ చైర్మన్ మణికొండ వేదకుమార్ సందర్శించారు. రామప్పలో నిర్వహిస్తున్న వరల్డ్ హెరిటేజ్ వాలంటీర్ క్యాంపెయిన్‌లో శిక్షణ తరగతులు నిర్వహించిన అనంతరం ఆయన ఆలయాలను సందర్శించారు.

ఇటీవల జాతీయ వారసత్వ కట్టడాలుగా గుర్తింపు పొందిన గొల్లాల గుడి శివాలయాల్లోని శిల్పకళా విశిష్టత, చారిత్రక ప్రాధాన్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా టూరిజం గైడ్ విజయ్ కుమార్ శివాలయాల చరిత్ర, ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం రామప్పలో నిర్మాణంలో ఉన్న ఇంటర్‌ప్రిటేషన్ సెంటర్‌ను సందర్శించారు.

మరిన్ని వార్తలు