శనేశ్వరునికి తిల తైలాభిషేకాలు

10-10-2026 | 05:36pm

బిజినేపల్లి, అక్టోబర్ 10 : మండలంలోని నంది వడ్డేమాన్ గ్రామానికి(Nandi Vaddeman Village) చెందిన జేష్టదేవి సమేత శ్రీ శనేశ్వరస్వామికి(Sri Shaneshwara Swamy) శనివారం భక్తులు తమ ఏలినాటి శని గ్రహదోష నివారణకు వేద మంత్రోచ్ఛారణలతో శాస్త్రోక్తంగా తిల తైలాభిషేకాలు, అష్టోత్తరం,  పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు డా.గవ్వమఠం విశ్వనాథ శాస్త్రి చేత  బ్రహ్మసూత్ర పరమ శివునికి రుద్రాభిషేక పూజలు, అర్చనలు, దీపారాధన నందీశ్వర స్వామికి ప్రత్యేక అర్చన పూజలు భక్తులచే నిర్వహించారు.

అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనం తీర్థ ప్రసాదాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఆలయ చైర్మన్ వెల్దండ గోపాల్ రావు, గ్రామ సర్పంచ్ టి.సుగుణమ్మ, కమిటీ సభ్యులు కెంచె రాజేష్, ప్రభాకరచారి, పుల్లయ్య, అడ్వకేట్ వీర శేఖర్ చారి, శ్రీకాంత్ రెడ్డి, ఆలయ ఆర్చకులు శాంతి కుమార్, ఉమామహేశ్వర్, సిబ్బంది గోపాల్ రెడ్డి భక్తులు, మహిళలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు