చిరుధాన్యాలను విస్తృతంగా సాగు చేయాలి

20-11-2026 | 05:16pm

పాలెం ఆర్.ఏ.ఆర్.ఎస్ - ఏ.డి.ఆర్ డాక్టర్ ఎల్. కృష్ణ.

బిజినేపల్లి, నవంబర్ 20 : రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చిరు ధాన్యాలను(millets) విస్తృతంగా సాగు చేయాలని పాలెం ఆర్.ఏ.ఆర్.ఎస్ - ఏ.డి.ఆర్ డాక్టర్ ఎల్. కృష్ణ అన్నారు. శుక్రవారం పాలెం కృషి విజ్ఞాన కేంద్రంలో(Palem Krishi Vigyan Kendra) చిరుధాన్యాల సాగుపై(Cultivation of Millets) శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా వచ్చిన డాక్టర్ ఎల్. కృష్ణ మాట్లాడుతూ నేల ఆరోగ్య పరిరక్షణ, పంట వైవిధ్యం, సమీకృత వ్యవసాయం(Integrated Farming), సహజ వ్యవసాయ పద్ధతుల ప్రాముఖ్యతను గుర్తించి సాగు చేయాలని వివరించారు.

యాసంగిలో తక్కువ సాగు నీటిని వినియోగించేలా బిందుసేద్యం, తుంపర సేద్యం, ఆరుతడితో సాగు చేసేలా పంటలు సాగు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ ప్రధాన శాస్త్రవేత్తలు డా. హరిప్రసన్న, డా.రాజేంద్ర కుమార్, పాలెం కే.వీ.కే సమన్వయకర్త డా. ఓ. శైల, శాస్త్రవేత్తలు డా.జి.ఈశ్వర రెడ్డి, డా. ఏ. శ్రీరామ్, కుమ్మెర, వసంతాపూర్, బాలన్‌పల్లి, పర్వతాపూర్, పర్వతాయిపల్లి, తెలకపల్లి, చిన్నంబావి గ్రామాల నుంచి 50 మంది రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు