నివాస భవన అనుమతితో ప్రైవేట్ హాస్పిటల్ నిర్వహణ.!

04-11-2026 | 02:58pm
  1. ట్రేడ్ లైసెన్స్ లేకున్నా పట్టించుకోని మున్సిపాలిటీ. 
  2. ప్రభుత్వ ఆదాయానికి గండి.
  3. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు, నెటిజన్ల ఆగ్రహం. 

నాగర్‌కర్నూల్ (విజయక్రాంతి): నాగర్‌ కర్నూల్ కొల్లాపూర్ చౌరస్తాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిపై(Private hospital) అక్రమాల ఆరోపణలు సోషల్ మీడియాలో(Social Media) వైరల్‌గా మారాయి. ఆసుపత్రికి మున్సిపాలిటీ నుంచి ట్రేడ్ లైసెన్స్ జారీ చేయలేదని ఆర్టీఐ సమాధానంలో వెల్లడైనట్లు ప్రచారం జరుగుతోంది.

నివాస భవన అనుమతితో కమర్షియల్ ఆసుపత్రి నిర్వహిస్తున్నారంటూ నిబంధనల ఉల్లంఘనలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదని నెటిజన్లు నిలదీస్తున్నారు. ఆరోపణలపై అధికారులు విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని, ఉల్లంఘనలు నిర్ధారణ అయితే చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు