బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని..

04-11-2026 | 03:00pm

మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి వినతి. 

నాగర్‌కర్నూల్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో ప్రభుత్వ బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి, పేద బీసీ విద్యార్థులకు ఉచిత పోటీ పరీక్షల శిక్షణ(Free Competitive Exam Coaching) అందించాలని ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి(MLA Dr. Kuchukulla Rajesh Reddy) మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతిపత్రం అందజేశారు. ఇందుకోసం జిల్లా కార్యాలయాల సముదాయంలో 4 వేల చదరపు అడుగుల ప్రభుత్వ భవనం అందుబాటులో ఉందని, వెంటనే అనుమతులు, నిధులు, సిబ్బంది కేటాయించి శిక్షణ ప్రారంభించాలని కోరారు.

మరిన్ని వార్తలు