చాకలి ఐలమ్మ 131.జయంతి
మాగనూరు సెప్టెంబర్ 26. మాగనూరు మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ(Chakali Ailamma) 131 జయంతి వేడుకలను శనివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల లు వేసి ఘనంగా నివాళులర్పించారు. జయంతి సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ భూమికోసం, భుక్తి,ముక్తి, రజాకార్లతో ,భూస్వాములతో ,పోరాటాలు చేసి పేదలకు భూములు పంచిపెట్టిన ఘనత చాకలి ఐలమ్మకు దక్కుతుందన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ ను ఆదర్శమని తీసుకొని పేద ప్రజల సంక్షేమం కోసం, దేశం కోసం ,జాతి కోసం, ధర్మం కోసం, యువ కులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, సంఘ సేవకులు, పాటుపడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో చాకలి వాబ య్య, దండు సత్యప్ప, కాంగ్రెస్ నాయకులు ఆనంద్ గౌడ్, భరత్ కుమార్, ఆంజనేయులు, వాకిటి వెంకటయ్య, చక్రపాణి రెడ్డి, చెన్నప్ప, అశోక్, తదితరులు పాల్గొన్నారు