ఆర్ఎంపీ వద్ద చికిత్స..

06-10-2026 | 07:43pm
  1. నారాయణపేట జిల్లా మద్దూర్ మున్సిపాలిటీ 
  2. చికిత్స అనంతరం మృతి చెందినట్లు బంధువుల ఆరోపణ

మద్దూరు: మద్దూరు పట్టణ కేంద్రంలోని(Maddur town center) ఓ ఆర్ఎంపీ వద్ద జ్వరానికి చికిత్స పొందిన మహిళ ఇంజక్షన్‌ చేసిన కొద్దిసేపటికే మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. కొత్తపల్లి మండలం నిడ్జింత గ్రామానికి చెందిన ఇటిక్యాల సాయమ్మ (43), భర్త మొగులప్ప, జ్వరంతో బాధపడుతూ చికిత్స కోసం మద్దూరు పట్టణంలోని ‘తాజ్’ అనే ఆర్ఎంపీ వద్దకు వచ్చినట్లు బంధువులు తెలిపారు. చికిత్సలో భాగంగా ఆమెకు ఇంజక్షన్‌ చేసిన కొద్దిసేపటికే పరిస్థితి విషమించి మృతి చెందినట్లు వారు పేర్కొన్నారు.

వెంటనే సాయమ్మను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు బంధువులు తెలిపారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. అయితే సాయమ్మ మృతికి ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెల్లడించాల్సి ఉందని కుటుంబ సభ్యులు కోరుతున్నారు

మరిన్ని వార్తలు