భూమిపూజ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

11-09-2026 | 03:20pm

ఉప్పల్ సెప్టెంబర్ 11విజయక్రాంతి ‌: ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన సముదాయం నిర్మాణానికి ఈ నెల 13న నిర్వహించనున్న భూమిపూజ కార్యక్రమం ఏర్పాట్లను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పరిశీలించారు. కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఆర్యవైశ్య ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని నిర్వాహకులకు ఎమ్మెల్యే సూచించారు. భక్తులు, అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

మరిన్ని వార్తలు