ముత్తారంలో విద్యుత్ భద్రతపై పొలంబాట
రైతులకు ఏ.ఈ నారాయణ అవగాహన
సమస్యలపై 1912కు ఫిర్యాదు చేయాలని సూచన
ముదిగొండ: sep 11(విజయక్రాంతి ): మండలంముదిగొండ పరిధిలోని పమ్మి సెక్షన్ ముత్తారం గ్రామం(Muttaram Village)లో శుక్రవారం రైతు పొలం బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈ నారాయణ రైతులకు విద్యుత్ భద్రతపై పలు సూచనలు, అవగాహన కల్పించారు.విద్యుత్‌కు సంబంధించిన సమస్యలు తలెత్తినప్పుడు రైతులు స్వయంగా ఫీజులు, విద్యుత్ తీగలు, ఇతర పరికరాల వద్ద పనులు చేపట్టకూడదని సూచించారు. ఎలాంటి విద్యుత్ సమస్య ఉన్నా వెంటనే విద్యుత్ సిబ్బందికి తెలియజేయాలని తెలిపారు.
రైతులు తమ మోటార్ల వద్ద ఆటోమేటిక్ స్టార్టర్లను తొలగించి కెపాసిటర్లను వినియోగించాలని సూచించారు.విద్యుత్ సమస్యలు, ఫిర్యాదుల కోసం 1912 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని రైతులకు తెలియజేశారు.విద్యుత్ సిబ్బందికి కూడా విధి నిర్వహణలో పాటించాల్సిన భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు.కార్యక్రమంలో ఎల్‌ఐ గంగాధర్, లైన్‌మెన్ ఉపేందర్, రైతులు,తదితరులు పాల్గొన్నారు.