అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా ఆర్ &బి అతిథి గృహం

11-09-2026 | 02:53pm

 పట్టించుకోని అధికార యంత్రాంగం

చేగుంట సెప్టెంబర్ 11,(విజయక్రాంతి):  చేగుంట(Chigunta) మండలంలోని జాతీయ రహదారి 44పక్కన గల ఆర్ & బి అతిథి గృహం ఇప్పుడు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారింది. అప్పటి మాజీ మంత్రివర్యులు చెరుకు ముత్యం రెడ్డి అధికారులకు, నాయకులకు ఇబ్బందులు గుర్తించి, కోట్ల రూపాయలు మంజూరు చేసి అతిథి గృహాన్ని  నిర్మించారు. ఇప్పుడు అది బోసపై విలాసాలకు, మందు బాబులకు అడ్డగా మారింది, గెస్ట్ హౌస్  చుట్టుపక్కల చెట్లు గడ్డితో వేలసిల్లుతూ కనిపిస్తున్నాయి.

అధికారులు, ఈ గెస్ట్ హౌస్ కు అతిథులు,  అధికారులు నాయకులు,  వస్తే,  దుర్వాసన, దోమలు ఈగలు వల్ల ఉండలేని స్థితిలో మారింది, గతంలో ఈ అతిథి గృహంలో ఎంతో మంది రాజకీయ నాయకులు, మంత్రులు, ఎంపీ,ఎమ్మెల్యేలు,ప్రెస్ మీట్ లు పెడుతూ కిలకిలలాడేది, ఇప్పుడు చూడడానికి అధ్వానంగా మారి రావడమే భారంగా మారింది, ఇప్పటికైనా అధికారులు పట్టించుకోని అతిథి గృహాన్ని వినియోగంలోకి తేవాలని పట్టణవాసులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు