నక్సల్స్‌కు గుడ్‌బై.. లొంగిపోయిన వారికి భారీ సాయం

28-11-2026 | 03:52pm

అమరావతి: జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Government of Andhra Pradesh) పునరావాస సాయం అందిస్తోంది. ఇందులో భాగంగా లొంగిపోయిన 18 మందికి రూ.75 లక్షల విలువైన డీడీలను ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా(AP DGP Harish Kumar Gupta) శనివారం పంపిణీ చేశారు. గత రెండున్నరేళ్లలో జరిగిన ఎదురుకాల్పుల్లో 18 మంది మావోయిస్టులుMaoists) మృతి చెందగా, మరో 73 మందిని అరెస్టు చేసినట్లు డీజీపీ వెల్లడించారు.

ఇప్పటివరకు లొంగిపోయిన వారికి రూ.91 లక్షలు అందించామని తెలిపారు. మరో 32 మందికి రూ.1.21 కోట్ల పునరావాస సాయాన్ని త్వరలో పంపిణీ చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో రాష్ట్రాన్ని నక్సల్స్ రహితంగా తీర్చిదిద్దామని డీజీపీ పేర్కొన్నారు. లొంగిపోయిన వారికి ఉపాధి, జీవనోపాధి కల్పించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.


మరిన్ని వార్తలు