మహిళా రిజర్వేషన్లకు అడ్డంకులు తొలగిస్తాం

28-11-2026 | 03:29pm

న్యూఢిల్లీ: పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు(33 Percent Women Reservation) కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) స్పష్టం చేశారు. మహిళలకు దక్కాల్సిన హక్కుల అమలుకు ఎదురయ్యే అన్ని అడ్డంకులను తొలగిస్తామని హామీ ఇచ్చారు. శనివారం ఎక్స్ వేదికగా విడుదల చేసిన వీడియో సందేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

మహిళా రిజర్వేషన్ల కోసం దశాబ్దాలుగా పోరాటం కొనసాగుతోందని, నారీశక్తికి ఇచ్చిన హామీని నెరవేరుస్తామని మోదీ పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) సైతం మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యత అని తెలిపారు. ఈ చారిత్రాత్మక నిర్ణయానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు.

కాగా, మహిళా రిజర్వేషన్లను 2029 ఎన్నికల నాటికి అమలు చేయాలనే లక్ష్యంతో కేంద్రం కొత్త డీలిమిటేషన్ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో సీట్ల సంఖ్యను 50 శాతం పెంచి, మహిళలకు మూడింట ఒక వంతు కోటా కల్పించాలని ప్రతిపాదించింది. ఈ బిల్లులపై చర్చించేందుకు నవంబర్ 30 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి.

మరిన్ని వార్తలు