ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే!
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల(MPTC ZPTC Elections) షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. నవంబర్ 3న నిర్వహించాల్సిన పోలింగ్‌ను 5వ తేదీకి వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఓట్ల లెక్కింపు తేదీలను కూడా సవరించింది.
ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 3న పరిషత్ ఎన్నికల పోలింగ్(Election polling) జరగాల్సి ఉంది. అయితే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల తేదీల్లో ఇప్పటికే మార్పులు చేసిన నేపథ్యంలో, ఎన్నికల నిర్వహణలో తలెత్తే ఇబ్బందులను నివారించేందుకు పరిషత్ ఎన్నికల షెడ్యూల్‌ను సవరించినట్లు సమాచారం. తాజా ప్రకటన ప్రకారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 5న జరగనుంది. ఓట్ల లెక్కింపు తేదీలను కూడా వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల(Local body elections) పోలింగ్‌ను అక్టోబర్ 28 నుంచి నవంబర్ 1కి, ఓట్ల లెక్కింపును అక్టోబర్ 30 నుంచి నవంబర్ 3కి గతంలోనే మార్చారు. ఈ షెడ్యూల్‌తో పరిషత్ ఎన్నికల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తకుండా తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి తదుపరి అధికారిక ప్రకటనలు, ఓట్ల లెక్కింపు తేదీలపై స్పష్టతను అభ్యర్థులు, ఓటర్లు గమనించాల్సి ఉంది.