దసరాకు 30 అడుగుల బొద్దింక దహనం!

17-10-2026 | 05:05am
  1. రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడి దిష్టిబొమ్మలతో సహా.. అగ్నికి ఆహుతి
  2. ఢిల్లీ రామ్‌లీలా ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణ
  3. స్వచ్ఛ భారత్ సందేశమే లక్ష్యం: నిర్వాహకులు

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: ఢిల్లీలోని రామ్‌లీలా(Delhi Ramlila) ఉత్సవంలో భాగంగా ఈ ఏడాది నిర్వహించే దసరా వేడుకల్లో ఓ ప్రత్యేక ఆకర్షణ చోటుచేసుకోనుంది. రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడి దిష్టిబొమ్మలతో పాటు 30 అడుగుల ఎత్తున భారీ బొద్దింక దిష్టిబొమ్మను కూడా దహనం చేయనున్నారు. బొద్దింకలను అపరిశుభ్రతకు చిహ్నంగా భావించి, ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకు న్నట్లు శ్రీ కేశవ్ రామ్‌లీలా కమిటీ నిర్వాహకులు శుక్రవారం తెలిపారు.

సర్‌లో అవకతవకలు, సీఈసీ రాజీనామా చేయాలని సీజేపీ నిరసన లు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ భారీ కాక్రోచ్ బొమ్మ దహనం అంశం రాజకీయంగా ప్రధాన్యత సంతరించుకుంది. ఢిల్లీలోని పీతాంపురలో ఏటా రామ్‌లీలా ఉత్సవాలను నిర్వహించే శ్రీ కేశవ్ రామ్‌లీలా కమిటీ ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఢిల్లీ కార్య క్రమాలకు మద్దతుగా ఈ ప్రత్యేక దిష్టిబొమ్మను ఏర్పా టు చేస్తున్నట్లు కమిటీ వెల్లడించింది.

ఈ నిర్ణయం రాజకీయ ప్రేరేపితమైనది కాదని కమిటీ అధ్యక్షుడు, బీజేపీ ఎమ్మెల్యే అశోక్ గోయల్ స్పష్టం చేశారు. చెడుపై మం చి సాధించే విజయానికి ప్రతీకగా ఈ కార్యక్రమాన్ని నిర్వ హిస్తున్నామని తెలిపారు. రావణుడి సైన్యంలోని అసురుల సరసన బొద్దింకను కూడా చేర్చి దహనం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బొద్దింక జనతా పార్టీ (సీజేపీ) ఢిల్లీలో నిరసనలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో 30 అడుగుల బొద్దింక దిష్టిబొమ్మ దహనం అంశం అత్యంత ఆసక్తికరంగా, రాజకీయంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు