మహిళా సంఘాలకు కొత్త వేదిక
కేసముద్రం (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామైక్య మహిళా సమాఖ్య భవనాన్ని గురువారం ఎంపీవో హరీష్, గ్రామ సర్పంచ్ ఏర్పుల సునీత ప్రారంభించారు.
ఈ సందర్భంగా గ్రామంలో మహిళా సంఘాల (Women's Self Help Groups) కార్యకలాపాలకు సొంత భవనం అందుబాటులోకి రావడంతో మహిళలు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆవుల ఐలయ్య, పంచాయతీ కార్యదర్శి కుమార్, మహిళా గ్రామైక్య సంఘాల అధ్యక్షులు అరిగే శాంత, బండారు పద్మ, వార్డు సభ్యులు, మహిళా సంఘాల ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, గ్రామ మహిళలు పాల్గొన్నారు.
అనంతరం గ్రామ సర్పంచ్ ఏర్పుల సునీత చేతుల మీదుగా చేయూత పింఛన్లు (Cheyutha Pensions) మంజూరైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.