ప్రాణాలు కాపాడే హెల్మెట్ వైరల్!
ప్రాణాలు కాపాడే సరికొత్త హెల్మెట్.. పడగానే ఎయిర్‌బ్యాగ్!
బైక్‌పై ప్రయాణించేవారికి ప్రమాదం ఎప్పుడు, ఎలా వస్తుందో చెప్పలేం. అందుకే రైడర్ల భద్రత కోసం కొత్త టెక్నాలజీలు(New technologies) అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ వింత వీడియో వైరల్ అవుతోంది. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ప్రమాదవశాత్తూ కిందపడగానే.. అతడు ధరించిన హెల్మెట్ నుంచి ఒక్కసారిగా Airbag బయటకు వచ్చి శరీరం మొత్తాన్ని చుట్టుముట్టినట్లు కనిపిస్తోంది. దీంతో ఈ వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అసలు ఇలాంటి Helmet Technology నిజంగానే అందుబాటులోకి వచ్చిందా? లేక ఇది AI సృష్టించిన వీడియోనా? అనే చర్చ మొదలైంది.
వైరల్ వీడియోలో(Viral video) రైడర్ కిందపడిన వెంటనే హెల్మెట్ నుంచి గాలి నిండిన రక్షణ కవచం విస్తరించి అతడి శరీరాన్ని కప్పేస్తుంది. ప్రమాద సమయంలో నేలకు తగిలే దెబ్బ తీవ్రతను తగ్గించాలనే ఆలోచనతో ఇలాంటి టెక్నాలజీ రూపొందించినట్లు వీడియో ద్వారా తెలుస్తోంది. ఈ టెక్నాలజీ వెనుక చైనాకు చెందిన Lanxi Yema Motorcycle Fittings, Yanfeng Automotive కంపెనీల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ రెండు సంస్థలూ వైరల్ వీడియోలో కనిపిస్తున్న ప్రత్యేక హెల్మెట్‌ను తామే తయారు చేసినట్లు ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. దీంతో వీడియో Authenticityపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉంటే, బైక్ రైడర్ల కోసం Airbag Jackets, Airbag Vests ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ప్రమాదాన్ని సెన్సార్ల ద్వారా గుర్తించి క్షణాల్లో గాలితో నిండిపోయే ఈ పరికరాలు ఛాతీ, మెడ, వెన్ను భాగాలకు రక్షణ కల్పిస్తాయి. అంతేకాదు.. 2022లో ఇటలీకి చెందిన AIROH, స్వీడన్‌కు చెందిన Autoliv సంస్థలు Airbag Technologyతో కూడిన హెల్మెట్ ప్రోటోటైప్‌ను కూడా పరిచయం చేశాయి. అయితే అది ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలోని హెల్మెట్‌కు సంబంధించినది కాదు. కాబట్టి ఈ వీడియోను నిజమైన ఉత్పత్తికి సంబంధించినదిగా నిర్ధారించడానికి ఆధారాలు లేవు. ప్రస్తుతానికి ఇది నిజమైన టెక్నాలజీనా, AI వీడియోనా అన్నది స్పష్టత రావాల్సి ఉంది.