కెప్టెన్ స్మిత్ మచ్చర్ పుర్రెకు ఫ్రాక్చర్
- మెదడు వైపు వెళ్తున్న ఎముక ముక్క
- అత్యవసర శస్త్రచికిత్స
అబుదాబీ, అక్టోబర్ 6: ఫ్లైదుబాయ్ విమానాన్ని(flydubai aircraft) ప్రమాదం నుంచి కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్(Indian pilot Captain Smith Matcher) తీవ్రంగా గాయపడినట్లు వైద్యులు తెలిపారు. ఆయన పుర్రెకు ఫ్రాక్చర్(Skull fracture) అయినట్లు, ప్రస్తుతం యూ ఏఈలోని అబుదాబిలో ఆయనకు అత్యవస ర శస్త్రచికిత్స చేసినట్లు, ప్రస్తుతం కోలుకుం టున్నట్లు పేర్కొన్నారు. గత నెల 30న దుబాయ్ నుంచి అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో ఈ ఘటన జరిగింది. విమానం గాల్లో ఉండగా కోపైలట్ హమామ్ అల్ హమ్మామీ కాక్‌పిట్‌లోని అత్యవసర గొడ్డలితో కెప్టెన్ మచ్చర్‌పై విచక్షణారహితంగా దాడి చేసిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి: కో-పైలట్ గతం బయటపడింది
తీవ్రంగా గాయపడిన.. మచ్చర్‌ను ప్రిన్స్ సుల్తాన్ బిన్ అబ్దుల్ అజీజ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయన పుర్రెను రీకన్‌స్ట్రక్షన్ చేశారు. ఆయన పుర్రెలో ఫ్రాక్చర్ ఏర్పడినట్లు గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం తర్వాత ఆయనను యూఏఈలోని అబుదాబిలో మిలిటరీ ఆసుపత్రికి తరలించారు. ఆయన పుర్రెకు అయిన గాయాన్ని ‘డిప్రెస్డ్ స్కల్ ఫ్రాక్చర్’గా వ్యవహరి స్తామని వైద్యు లు తెలిపారు. ఈ స్థితిలో పుర్రె విరిగి, అందులోని ఎముక ముక్క మెదడు వైపు వెళుతుం దన్నారు.
ఇది సీరియస్ గాయమని, ఈ స్థితిలో ఎముక ముక్క మెదడుపై ఒత్తిడి కలిగించడం లేదా గాయపరచడం వంటివి చేసే ప్రమాదం ఉందని డాక్టర్లు వివరించారు. ఈ సమయంలో మచ్చర్‌కు అత్యవసర మెడికల్ కేర్ లేదా సర్జరీ అవసరమన్నారు. దీంతో ఆయనకు అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించామని, ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడని చెప్పారు.
ఇవి కూడా చదవండి: ‘ఫ్లుదుబాయ్’ని కూల్చాలనుకున్నా
అయితే, అతని తలకు, శరీరంలోని ఇతర భాగాలకు తీవ్ర గాయాలు కావడంతో అతను పూర్తిగా కోలుకోవడానికి కొంత సమయం పట్టవచ్చని వైద్యులు తెలిపారు. అతనికి చికిత్స అందిస్తున్న వైద్యులతో అబుదాబిలోని భారత మిషన్ నిరంతరం సంప్ర దింపులు జరుపుతోందని సంబంధిత వర్గా లు తెలిపాయి. మచ్చర్‌ను కలిసేందుకు అధికారులు ఆయన కుటుంబ సభ్యులను అను మతివ్వడంతో వారు కలిసి మాట్లాడారు.