ఏపీలో స్థానిక రగడ

17-10-2026 | 05:00am
  1. పుంగనూరు వైసీపీ కార్యాలయం దగ్ధం, 15 వాహనాలకు నిప్పు
  2. నామినేషన్ల సందర్భంగా టీడీపీ, వైసీపీ శ్రేణుల దాడులు
  3. పరస్పరం దాడుల్లో పలువురికి గాయాలు
  4. దాడులకు కారణం టీడీపీ, వైసీపీ అంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు
  5. కేంద్ర బలగాల పహారాలో ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టులో వైసీపీ పిటిషన్

అమరావతి, అక్టోబర్ 16: ఆంధ్రప్రదేశ్‌లో 100 పురపాలక, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో శుక్రవారం ఉదయం 11గంటల నుంచి నామినేషన్లు స్వీకరణ ప్రారంభమైంది. ఈ క్రమంలో నామినేషన్ల దాఖలు కేంద్రాల వద్ద వైసీపీ(YCP), టీడీపీ(TDP) శ్రేణుల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

అన్నమయ్య, పుంగనూరు, రాయచోటి, శ్రీ సత్యసాయి జిల్లాలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య దాడులు, వాగ్వివాదాలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ(Election nomination process) స ందర్భంగా రాయలసీమలోని పుంగనూరు, రాయచోటి, ధర్మవరం, తిరుపతి నియోజకవర్గాల్లో వైసీపీ విధ్వంసం సృష్టించిందని టీడీ పీ సీనియర్ నేతలు వర్ల రామయ్య, అశోక్‌బాబులు ఎన్నికల కమిషనర్‌కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. వైసీపీ దౌర్జన్యాలపై తక్షణ మే విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్య లు తీసుకోవాలని కోరారు.

రాష్ట్రంలో టీడీపీపై వ్యతిరేకత పెరుగుతుండడంతో ఇలాం టి దాడులకు తెగబడుతున్నారని, ప్రభుత్వం జంగిల్‌రాజ్ పాలనను కొనసాగిస్తుందని వైసీపీ అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. మిథున్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించి ఆయనను ఫోన్‌లో పరామర్శించి ధైర్యం చెప్పారు. రాయచోటి ఎస్‌ఎన్ కాలనీలో వైసీపీ కార్యాలయానికి నిప్పు పెట్టారు. అక్కడ ఉన్న 15 వాహనాలకు ని ప్పుపెట్టడంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నా యి. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఇరువర్గాలను చెదరగొట్టారు. 

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మున్సిపల్ కార్యాలయం వద్ద కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉద యం నుంచి వాహనాలతో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తమ్ముడు కృష్ణారెడ్డి హల్చల్ చేశాడు. దీనిపై భాజపా కార్యకర్తలు అభ్యంతరం తెలపడంతో ఉద్రిక్తతలు తలెత్తాయి. పల్నాడు జిల్లా మాచవరం ఎస్సీ కాలనీలో ఎస్సీ కమిషన్ చైర్మన్ పర్యటించి దాడిలో గాయపడిన బాధితులను పరామర్శించారు. దాచేపల్లిలో వైసీపీ అభ్యర్థి కొప్పుల రవికుమార్‌ను అక్రమంగా అరెస్టు చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలను పారా మిలటరీ బలగా ల పర్యవేక్షణలో నిర్వహించాలని వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. వాదనలు విన్న కోర్టు విచారణను వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు