హైదరాబాద్‌లో ‘మౌంట్’ ఏర్పాటు
శాండ్‌విచ్ పీయూఎఫ్ ప్యానెల్ తయారీ కేంద్రం ప్రారంభం
హైదరాబాద్, నవంబర్ 18(విజయక్రాంతి): పారిశ్రామిక నిర్మాణ పరిష్కారాలు, శాండ్‌విచ్ పీయూఎఫ్ ప్యానెల్స్(Sandwich PUF panels) తయారీలో ప్రముఖ సంస్థ మౌంట్ రూపింగ్ అండ్ స్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్‌లో తన నూతన తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. తెలంగాణలో తొలి నిరంతర శాండ్‌విచ్ పీ యూఎఫ్ ప్యానెల్ తయారీ లైన్‌ను ప్రారంభించడం సంస్థ విస్తరణలో కీలక మైలురాయిగా నిలిచింది.
సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కేంద్రంలో మూడు ఉత్పత్తిలైన ఏర్పాటుకు సదుపాయాలు కల్పించగా, ప్రస్తుతం నెలకు 3 లక్షల చదరపు మీటర్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన నిరంతర శాండ్‌విచ్ పీయూఎఫ్ ప్యానెల్ తయారీ లైన్ కార్యకలాపాలు ప్రారంభించింది. పారిశ్రామిక పైకప్పులు, గోడల నిర్మాణాలు, శీతల నిల్వ కేంద్రాలు, ఆహార శుద్ధి పరిశ్రమలు, ఔషధ పరిశ్రమలు తదితర రంగాలకు అవసరమైన ఉష్ణ నిరోధ క నిర్మాణ సామగ్రి తయారీకి ఈ యూనిట్ తోడ్పడుతుంది. హైదరాబాద్‌లో ఈ కేంద్రం ప్రారంభం మౌంట్ తయారీ విస్తరణ, సాంకేతిక ఆవిష్కరణలు, నాణ్యమైన ఉష్ణ నిరోధక నిర్మాణ పరిష్కారాల అభివృద్ధిలో మరో కీలక ముందడుగుగా నిలుస్తోంది.