'బ్రిక్స్' ఎవరికీ వ్యతిరేకం కాదు.. మోదీ కీలక సందేశం
బ్రిక్స్ సభ్యదేశాలు గ్లోబల్ సౌత్ దేశాలకు దిశానిర్దేశం
బ్రిక్స్ సదస్సుకు రెండేళ్లు పూర్తి
బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగం
న్యూఢిల్లీ: బ్రిక్స్ సదస్సుకు(BRICS Summit) వచ్చిన అతిథులకు ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) స్వాగతం పలికారు. బ్రిక్స్ ఏర్పాటు చేసి రెండు దశాబ్దాలు పూర్తయ్యిందని ప్రధాని మోదీ తెలిపారు. బ్రిక్స్ సభ్యుదేశాల ప్రజలకు మనం భరోసా కల్పించాలన్నారు. పరస్పర సహకారంతో బ్రిక్స్ దేశాలు మరింత అభివృద్ధి చెందాలన్నారు. అంతర్జాతీయ సమస్యలకు మనం పరిష్కారం చూడాల్సిఉందని తెలిపారు. మనం వేసే ప్రతి అడుగులో మానవాభివృద్ధే కీలకం కావాలని పిలుపునిచ్చారు. ఐరాస భద్రతామండలిలో(UN Security Council) సంస్కరణలు చేపట్టాలని పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఉమ్మడి బాధ్యత తీసుకుందామని చెప్పారు. ఏఐ, సైబర్ స్పేస్, బయోటెక్నాలజీ రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలన్నారు. బ్రిక్స్ సభ్యదేశాలు.. గ్లోబల్ సౌత్ దేశాలకు దిశానిర్దేశం చేయాలని సూచించారు.