ప్రపంచ నాయకులకు ప్రధాని మోదీ స్వాగతం

12-09-2026 | 03:16pm

న్యూఢిల్లీ: ఉక్రెయిన్, పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధాల ప్రపంచవ్యాప్త ప్రభావం నుండి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలను రక్షించడం లక్ష్యంగా రెండు రోజుల పాటు జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర(BRICS Summit 2026) సమావేశాన్ని ప్రారంభించేందుకు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) శనివారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో(Chinese President Xi Jinping) సహా ప్రపంచ నాయకులకు భారతదేశానికి స్వాగతం పలికారు. 

ఈ శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతున్న ఇతర నాయకులలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో, అబుదాబి యువరాజు(Crown Prince of Abu Dhabi) మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ అలీ, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి, వియత్నాం ప్రధాని లే మిన్ హంగ్ ఉన్నారు. 

UN సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్, WTO డైరెక్టర్ జనరల్ న్గోజీ ఒకోంజో-ఇవాలా, WHO చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్, న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (NDB) ప్రెసిడెంట్ దిల్మా రౌసెఫ్, ఆసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ చీఫ్ జూ జియాయ్ కూడా బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభం, ట్రంప్ పరిపాలన కాలం నాటి వాణిజ్య, సుంకాల విధానాల వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న తరుణంలో జరుగుతున్నందున, న్యూఢిల్లీలోని 'భారత్ మండపం'లో జరిగిన ఈ శిఖరాగ్ర సమావేశం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది.



మరిన్ని వార్తలు