భారీ ఏసుక్రీస్తు శిలువ పడి ఫాదర్ మృతి
చర్చిలో మరణ సందేశం లైవ్ ఇస్తుండగా ఘటన
ఈక్వెడార్‌లోని గ్వాయాకిల్ నగరంలో విషాదం
గ్వాయాకిల్: మరణం అనివార్యమని విశ్వాసులకు సందేశం ఇస్తున్న ఓ కాథలిక్ చర్చి ఫాదర్(Catholic Church Father).. కొద్దిసేపటికే అదే మరణానికి బలయ్యారు. గోడకు అమర్చిన భారీ ఏసుక్రీస్తు శిలువ(Cross of Jesus Christ) ఒక్కసారిగా ఊడి ఆయన తలపై పడటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రార్థనా కార్య క్రమం ప్రత్యక్ష ప్రసారమవుతుండగా(Live broadcast) ఈ దుర్ఘటన జరగడం తీవ్ర కలకలం రేపింది. ఈ విషాద ఘటన ఈక్వెడార్‌లోని గ్వాయాకిల్ నగరం లో ఈ నెల 17న చోటుచేసుకోగా ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది.
గ్వాయాకిల్లోని అవర్ లేడీ ఆఫ్ పెర్పెచువల్ హెల్ప్ చర్చిలో ఫాదర్ పాట్రిసియో ఆల్ఫ్రెడో సాంచెజ్ మోలినారి ప్రార్థనా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో వెనుక గోడకు పైభాగంలో అమర్చిన భారీ శిలువ ఊడితల వెనుకభాగంలో బలంగా తాకింది. దీంతో ఫాదర్ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.