టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటన.. ముగ్గురు షూటర్ల అరెస్ట్
- రాజస్థాన్‌లోని కోటా రైల్వే స్టేషన్‌లో పోలీసులకు చిక్కిన నిందితులు
- ట్రాన్సిట్ వారెంట్ పొందిన ముంబై పోలీసులు
- రెక్కీ చేసి దాడి.. ఏడు రౌండ్ల ఫైరింగ్
- తుపాకీలో లోపం.. టైగర్ ష్రాఫ్ సేఫ్? గన్‌పౌడర్‌తో ష్రాఫ్‌కు గాయాలు
- లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో లింకులు?
ముంబై, అక్టోబర్ 19: బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై(Bollywood actor Tiger Shroff) కాల్పుల ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. రాజస్థాన్‌లోని కోటా రైల్వే స్టేషన్‌లో(Kota Railway Station) రైలులో ప్రయాణిస్తున్న సమయంలో వారిని అదుపులోకి తీసుకున్నట్లు దర్యాప్తు అధికా రులు వెల్లడించారు. కాల్పులు జరిపిన తర్వాత అనుమానితులు కనిపించిన అంధేరి వెస్ట్ రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వారి ని గుర్తించారు. నిందితుల్లో ఇద్దరు హర్యానాకు చెందిన ఫూల్ సింగ్, రెహాన్, మరొకరు బీహార్‌కు చెందిన హృతిక్ కుమార్‌గా(Hrithik Kumar) పోలీసులు గుర్తించారు.
ఈ ఫుటేజ్‌ను కోటా పోలీసులతో పంచుకు న్న ముంబై పోలీసులు(ముంబై పోలీసులు,), ఆ ముగ్గురిని నగరానికి తీసుకురావడానికి ట్రాన్సిట్ వారెం ట్ పొందారు. ఆ ముగ్గురినీ ముంబై పోలీసులకు అప్పగించారు. రెక్కీ నిర్వహించి పక్కా ప్లాన్ ప్రకారమే దాడి చేసినట్లు, ఏడు రౌండ్ల ఫైరింగ్ చేసినట్లు సమాచారం. గన్‌పౌడర్ కారణంగా ష్రాఫ్‌కు గాయాలైనట్లు తెలుస్తుంది. ఒకరి తుపాకీలో లోపం వల్లే టైగర్‌ష్రాఫ్ ప్రాణాలతో బయట పడ్డట్లు పరిశీలిస్తున్నారు. ఈ కాల్పులకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో లింకులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ష్రాఫ్‌పై కాల్పులకు తానే బాధ్యుడినని గ్యాంగ్‌స్టర్ అనిల్ పండిట్ ప్రకటించడం, బాలీవుడ్‌కు బెదిరింపుల ఆడియో పంపడంతోపాటు తాజా పరిణామాలతో ముంబై మళ్లీ 1990లో దావుద్ మాఫి యాలో వెళ్తుందా? సందేహాలు కలుగుతున్నాయి. ముంబైలో ఆదివారం జరిగిన కాల్పుల్లో నటుడు సురక్షితంగా బయటపడగా, అతని డ్రైవర్, ఒక ఆటోడ్రైవర్ గాయపడ్డారు. రాజస్థాన్ యాంటీ-గ్యాంగ్‌స్టర్ టాస్క్ ఫోర్స్ (ఏజీటీఎఫ్), కోటా నగర పోలీసుల సంయుక్త బృందం రైల్వే కాలనీ ప్రాంతంలో ముగ్గురిని పట్టుకుందని ముంబై పోలీసులు పేర్కొన్నారు.
సోమవారం ఉదయం సుమారు 10.15 గంటలకు పూణే- సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెరస్‌లో కోటాకు చేరుకున్నామని తెలిపారు. కాల్పుల ఘటనకు సంబంధించి మహారాష్ట్ర-, గుజరాత్ సరిహద్దుకు చెందిన ఒక వ్యక్తితో సహా మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన ముగ్గురు ప్రధాన నిందితు లకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధాలున్నట్లు పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే టైగర్ ష్రాఫ్ కదలికలను ముందు గానే రెక్కీ నిర్వహించి, పక్కా ప్రణాళికతో కాల్పులకు పాల్పడినట్లు దర్యాప్తు వర్గాలు భావిస్తున్నాయి.
ఆయన ప్రతి ఆదివారం ముంబైలోని జుహు ఫుట్‌బాల్ మైదానానికి వెళ్తుంటారని తెలుసుకున్న నిందితులు, అక్కడి నుంచి కారులో బయలుదేరే సమయంలో దాడి చేసేందుకు ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. కాల్పుల ఘటనకు ముందు నటుడు ఫుట్‌బాల్ మైదానం వద్దకు వచ్చిన అభిమానులతో మాట్లా డిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దాడికి గంట ముందు కూడా ఆయన అభిమానులతో ముచ్చటించినట్లు కథనాలు పేర్కొంటున్నాయి.
కాల్పుల అనంతరం నిందితులు అంధేరి వెస్ట్ రైల్వే స్టేషన్ సమీపంలో తమ బైక్‌ను వదిలేసి, బోరివాలి వైపు వెళ్లే రైలును ఎక్కినట్లు పోలీసులు వెల్లడించినట్లు సమాచారం. అనంతరం మహారాష్ట్ర సరిహద్దు దాటి గుజరాత్‌లోకి ప్రవేశించినట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. చివరకు రాజస్థాన్‌లోని కోటా రైల్వే స్టేషన్‌లో పోలీసులకు చిక్కారు. నిందితులు ప్రొఫెషనల్ షూటర్లా అనే కోణంలోనూ విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిండే తీవ్రంగా స్పందించారు.
అనుమానితులను పోలీసులు గుర్తించారని, వారు రాష్ట్రం వెలుపల లేదా విదేశాల నుంచి పనిచేస్తున్నప్పటికీ, సూత్రధారులను వెంబ డిస్తామని ఫడ్నవీస్ తెలిపారు. ఆదివారం రాత్రి టైగర్ ష్రాఫ్‌ను పరామర్శించిన శిండే..గన్‌పౌడర్, గాజు పెంకుల వల్ల నటుడు ష్రాఫ్ కుడి చేతికి గాయాలయ్యాయని తెలిపారు.
మరోవైపు, నటుడిపై కాల్పుల ఘటనను ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియే షన్ తీవ్రంగా ఖండించింది. సినీ ప్రముఖుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. కాల్పులకు సంబంధించిన వీడియోలో ఒక దుండగుడు టైగర్ ష్రాఫ్ బీఎండబ్ల్యూ కారుపై కాల్పులు జరుపుతుండగా, రెండో వ్యక్తి తన తుపాకీతో ఇబ్బంది పడుతూ, కాల్చలేకపోతున్నట్లు కనిపించాడు. తుపాకీ లోపమే ష్రాఫ్ సేఫైట్లు తెలుస్తుంది.
గ్యాంగ్‌స్టర్ అనిల్ పండిట్ బెదిరింపులు?
బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులకు తానే బాధ్యుడినని అమెరికాకు చెందిన గ్యాంగ్‌స్టర్ అనిల్ పండిట్ ప్రకటించుకున్నాడు. దీంతో బాలీవుడ్ పరిశ్రమపై ఆడియో క్లిప్‌లను పలు భద్రతా సంస్థలకు ఆయన పంపాడు. లారెన్స్ బిష్ణోయ్, బిష్ణోయ్ కమ్యూనిటీకి చెందిన అందరికీ సినీనటుడు సల్మాన్‌ఖాన్ కూడా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. గ్యాంగ్‌స్టర్ అనిల్ పండిట్ హర్యానాలోని పానిపట్‌కు చెందిన వాడు. 2024లో అక్రమ మార్గం(డంకీ రూట్‌లో) అమెరికాకు వలసెళ్లినట్లు సమాచారం.
భారత్‌లో ఉన్నంతవరకూ అతడిపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని, తర్వాత మాత్రం ఆయనపై అనేక కేసులు నమోదైనట్లు సమాచారం. అనిల్‌కు హ్యాండ్లర్‌గా ఉన్న హారీ బాక్సర్(హరిచంద్ జాట్) 2022 నుంచి అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని, అతడిపై రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీలో దోపిడీ, హత్యాయత్నం కేసులు ఉన్నట్లు సమాచారం.