అలై బలై గీతాన్ని ఆవిష్కరించిన దత్తాత్రేయ

20-10-2026 | 05:00am

22న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో వేడుకల నిర్వహణ

ముషీరాబాద్, అక్టోబర్19 (విజయక్రాం తి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు(Telangana Culture and Traditions), సోదరభావం, ఐక్యతకు ప్రతీకగా నిలిచే ‘దత్తన్న అలై బలై 2026’ కార్యక్రమానికి సం బంధించిన గీతాన్ని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ(Bandaru Dattatreya) సోమవారం హైదరాబాద్‌లో ఆ విష్కరించారు. ప్రముఖ జానపద గాయకు డు నర్సీ రెడ్డి (నల్గొండ గద్దర్) ఆలపించిన ఈ పాటను విడుదల చేశారు.

ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ అలై బలై రాజకీయాలకు అతీతంగా వివిధ పార్టీల నాయకులు, ప్రజలు ఒకే వేదికపై కలుసుకుని ఆత్మీయతను పంచుకునే గొప్ప సాంస్కృతిక వేడుక అన్నారు. దత్తన్న అలై బలై వేడుకలను ఈనెల 22న ఉదయం10 గంటలకు హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అలై బలై ఫౌండేషన్ చైర్‌పర్సన్ బండారు విజయలక్ష్మి, ఫౌండేషన్ సభ్యుడు ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు