ప్రొఫెషనల్స్‌ను భాగస్వామ్యం చేయాలి

20-10-2026 | 05:05am
  1. పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి
  2. ఏఐపీసీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్‌తో సీఎం రేవంత్ రెడ్డి 

హైదరాబాద్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను(development and welfare programs) ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రొఫెషనల్స్‌ను కూడా భాగస్వామ్యం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అన్నారు.  సీఎంని సోమవారం ఎంసీహెచ్‌ఆర్డీ కేంద్రంలో ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (ఏఐపీసీ) చైర్మన్ మధుయాష్కీ గౌడ్(Madhu Yashki Goud) మర్యాదపూర్వకంగా కలిశారు.

ఏఐపీసీ చైర్మన్‌గా బాధ్యత లు చేపట్టిన మధుయాష్కీ గౌ డ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి శు భాకాంక్షలు తెలిపారు.  ఈ సదర్భంగా వారి రువురు రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు,  సంక్షేమ పథకాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆర్థిక పరిస్థితి, గత ప్రభుత్వంలో చేసిన సుమారు రూ.8 లక్షల కోట్ల అప్పుల పై వడ్డీ భారం తదితర అం శాలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు