టీవీకేకు రూ.13.3 కోట్ల విరాళాలు

20-10-2026 | 05:30am

ఇద్దరు మంత్రుల నుంచే 99 శాతం!

ఏఐఏడీఎంకేకు రూ.161.35 కోట్లు.. డీఎంకేకు రూ.191.19 కోట్లు

టైగర్ అసోసియేట్స్ నుంచే భారీగా నిధులు

ఎన్నికల సంఘం గణాంకాల్లో వెల్లడి

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో(Tamil Nadu politics) కీలకంగా మారిన సినీనటుడు, సీఎం విజయ్(Film actor, CM Vijay) నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం(Tamilaga Vettri Kazhagam) (టీవీకే)కు 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.13.3 కోట్ల స్వచ్ఛంద విరాళాలు అందాయి. నలుగురు దాతల నుంచి ఈ మొత్తాన్ని సేకరించారు. ఇందులో దాదాపు 99 శాతం ఇద్దరు మంత్రుల నుంచే రావడం గమనార్హం. అలాగే ఏఐఏడీఎంకేకు రూ.161.35 కోట్లు.. డీఎంకేకు రూ.191.19 కోట్లు విరాళాలు వచ్చాయి. ఈ రెండు పార్టీలకు టైగర్ అసోసియేట్స్ నుంచే భారీగా నిధులు సమకూరాయి.

మాజీ సీఎం స్టాలిన్ నేతృత్వంలోని ఏఐఏడీఎంకే పార్టీకి 135 కోట్లు, డీఎంకే పార్టీకి125 కోట్లు దానంతో అతిపెద్ద దాతగా టైగర్ అసోసియేట్స్ నిలిచింది. ఈ మేరకు పార్టీ భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన వివరాల్లో ఆ పార్టీలు వెల్లడించాయి. టీవీకే ప్రభుత్వంలో క్రీడలు, ప్రజా పనుల శాఖ మంత్రి ఆదవ్ అర్జున రూ.8.2 కోట్లు, మరో మంత్రి ఆర్‌వీ రంజిత్‌కుమార్ రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చారు. వీరిద్దరి విరాళాల మొత్తం రూ.13.2 కోట్లు. మిగిలిన రూ.10 లక్షలను తూత్తుకుడిలోని లయన్స్ టౌన్ చిరునామాతో నమోదైన స్నో షో, స్నో ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ సంస్థలు చెరో రూ.5 లక్షల చొప్పున డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా అందించాయి.

మొత్తం విరాళాల్లో అత్యధికంగా రూ.8.2 కోట్లు ఇచ్చిన అర్జున అతిపెద్ద దాతగా నిలిచారు. మరోవైపు, తమిళనాడులోని ప్రధాన రాజకీయ పార్టీలైన ఏఐఏడీఎంకే, డీఎంకేలకు కూడా భారీ మొత్తంలో విరాళాలు అందినట్లు ఎన్నికల సంఘం గణాంకాలు వెల్లడించాయి. 202526 ఆర్థిక సంవత్సరంలో ఏఐఏడీఎంకేకు రూ.161.35 కోట్లు, డీఎంకేకు రూ.191.19 కోట్ల స్వచ్ఛంద విరాళాలు అందినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈ రెండు పార్టీలకు టైగర్ అసోసియేట్స్ సంస్థ నుంచి అత్యధిక విరాళాలు అందాయి.

ఏఐఏడీఎంకేకు రూ.135 కోట్లు, డీఎంకేకు రూ.125 కోట్లు ఆ సంస్థ సమకూర్చింది. దీంతో ఆయా పార్టీలకు అతిపెద్ద దాతగా నిలిచింది. 2024 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేయడానికి ముందు, మార్టిన్కు చెందిన ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ సంస్థ ఆ బాండ్లను అత్యధికంగా కొనుగోలు చేసిన సంస్థగా నిలిచింది. అనంతరం బహిర్గతమైన వివరాల ప్రకారం, ఆ సంస్థ ఎన్నికల బాండ్ల ద్వారా డీఎంకేకు రూ.509 కోట్ల విరాళాలు అందించింది. తాజాగా ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల వివరాలు తమిళనాడులో రాజకీయ పార్టీలకు అందుతున్న నిధుల పరిమాణాన్ని మరోసారి చర్చనీయాంశంగా మార్చాయి.

మరిన్ని వార్తలు