ఘనంగా దుర్గా పూజ వేడుకలు

20-10-2026 | 05:35am

షేక్‌పేటలోని సూరజ్ భాన్ గార్డెన్స్‌  

 హైదరాబాద్, అక్టోబర్ 19(విజయక్రాంతి): హైదరాబాద్‌లోని షేక్‌పేటలో ఉన్న చారిత్రక సూరజ్ భాన్ గార్డెన్స్‌లో(Historic Suraj Bhan Gardens) సోమవారాం సూరజ్ భాన్ కుటుంబం ఆధ్వర్యంలో మా దుర్గా పూజ వేడుకలు(Durga Puja celebrations) ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో వెయ్యి మందికి పైగా భక్తులు(devotees) పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు(Special prayers) నిర్వహించారు. అనంతరం జరిగిన భక్తి భజనలు భక్తులను(devotees) ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తాయి.1964 నుంచి కొనసాగుతున్న సూరజ్ భాన్ గార్డెన్స్ హైదరాబాద్‌లోని పురాతన ద్రాక్ష తోటల్లో ఒకటిగా ప్రత్యే క గుర్తింపును కలిగి ఉంది.

రంగారెడ్డి జిల్లా పరిధిలోని షేక్‌పేటలో, సర్వే నంబర్ 1, హుస్సేన్ షావలి దర్గా సమీపంలో ఉన్న ఈ గార్డెన్ ఆరు దశాబ్దాలకు పైగా తన చారిత్రక ప్రాధాన్యతను కొనసాగిస్తోంది. ఈ సందర్భంగా సూరజ్ భాన్ గార్డెన్స్ సహ యజమాని మనీష్ కుమార్ మాట్లాడుతూ, మా దుర్గా పూజ వేడుకల్లో 1,000 మందికి పైగా భక్తులు పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది..

అమ్మవారి ఆశీస్సు లతో అందరికీ సుఖసంతోషాలు, ఆరోగ్యం, శాంతి కలగాలని కోరుకుంటున్నాం అని అన్నారు.1964 నుంచి చారిత్రక వారసత్వాన్ని కొనసాగిస్తున్న సూర జ్ భాన్ గార్డెన్స్లో సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించడం మాకు ఎంతో ప్రత్యేకం. భక్తులు తమ కుటుంబసభ్యులతో కలిసి పాల్గొని పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం సంతోషంగా ఉంది అని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు