ఎల్ నినోపై క్యాబినెట్ సబ్ కమిటీ

20-10-2026 | 05:30am
  1. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చైర్మన్ 
  2. సభ్యులుగా మంత్రులు సీతక్క, ఉత్తమ్, వాకిటి, పొంగులేటి, తుమ్మల 
  3. కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు చర్యలు 
  4. సమీక్షించి ప్రభుత్వానికి సిఫారసులు 

హైదరాబాద్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఎల్ నినో పరిస్థితులపై(El Niño conditions) అధ్యయనానికి క్యాబినెట్ సబ్ కమిటీని(Cabinet Sub-Committee) ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమి టీకి చైర్మన్‌గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) వ్యవహరించనున్నారు. మంత్రులు సీతక్క(Seetakka), ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొం గులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి సభ్యులుగా ఉం టారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవా రం ఆదేశాలు జారీ చేసింది. కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలపై ఈ కమిటీ సమీక్షించనుంది.

అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు(Drinking water issues) తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టనుంది. నీటి లభ్యత, తాగునీటి సరఫరాపై నిరంతర సమీక్షలు నిర్వహించనుంది. జల సంరక్షణకు ప్రాధాన్యం, ఇంకుడు గుంతలు, ఊట కుంటల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించనుంది. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాల పెంపు కోసం ప్రత్యేక చర్యలు తీసుకోనుంది. వేసవికి ముందే గ్రామీణ నీటి సమస్యల గుర్తింపు, పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేయనుంది. అలాగే ఎల్ నినో ప్రభావంపై ఎప్పటికప్పుడు సమీక్షించి.. రాష్ట్ర ప్రభుత్వానికి కమిటీ సిఫారసులు చేయనుంది.

మరిన్ని వార్తలు